1998 డీఎస్సీ అభ్యర్థుల ముట్టడియత్నం... జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత!

30-03-2021 Tue 10:46 | Both States
  • 1998 నుంచి పోస్ట్ లు ఇవ్వని ప్రభుత్వాలు
  • పాదయాత్రలో ఆదుకుంటానని జగన్ హామీ
  • ఇంకా పోస్ట్ లు ఇవ్వలేదని నిరసన
1998లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో క్వాలిఫై అయి, ఆపై పోస్ట్ లను పొందలేకపోయిన టీచర్ అభ్యర్థులు, ఈ ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నించిన వేళ, స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ సమస్యల గురించి పాదయాత్రలో తెలుసుకున్న జగన్, అధికారంలోకి వస్తే, తమకు పోస్ట్ లను ఇప్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఈ హామీ ఇచ్చి, 22 నెలలైనా అమలు చేయలేదని ఆరోపించారు. నిరసన తెలిపేందుకు తాడేపల్లి భరతమాత విగ్రహం వద్దకు చేరుకున్న డీఎస్సీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఆపై వారిని అరెస్ట్ చేసి, అక్కడి నుంచి వాహనాల్లో తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో పలువురు నిరుద్యోగులు వాగ్వాదానికి దిగారు.
1998 DSCJaganCamp OfficePolice

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more